Ileana : నటి ఇలియానా డిక్రూజ్ ఆసక్తికరమైన అప్ డేట్ పంచుకుంది. తన భర్త మైఖేల్ డోలన్ తో రెండో గర్భధారణను ప్రకటించింది. 2023లో ఇలియానా , మైఖేల్ ఒక సన్నిహిత వేడుకలో ఒక్కటయ్యారు. కడుపుతో ఉన్న చిత్రాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.
Ileana 2nd Baby
నూతన సంవత్సర పండుగ సందర్భంగా గర్భం దాల్చినట్లు పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఇవాళ తను కన్సీవ్ అయినట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి అర్ధరాత్రి చిరుతిండితో పాటు ఒక యాంటాసిడ్ ను చూపించే ఫోటోను షేర్ చేసింది. ఇలియానా తాజాగా చేసిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు గర్భవతి అని నాకు చెప్పకుండానే మీరు గర్భవతి అని చెప్పండి అంటూ కోరింది ఈ లవ్లీ ముద్దుగుమ్మ.
తమ కొడుకును ప్రేమగా పెంచుతున్నట్లు తెలిపింది ఇలియానా డిక్రూజ్(Ileana) . గత ఏప్రిల్ లో తన మొదటి గర్భధారణను ప్రకటించింది. అందరిని ఆశ్చర్య పరిచింది. త్వరలో వస్తోంది. నిన్ను కలవడానికి వేచి ఉండలేనంటూ పేర్కొంది ఈ నటి. నా చిన్ని డార్లింగ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది వైరల్ గా మారింది.
మన ప్రియమైన అబ్బాయిని ప్రపంచానికి స్వాగతించడానికి మేము ఎంత సంతోషంగా ఉన్నామో పదాలు వర్ణించలేవు. హృదయం నిండి పోయింది అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. కాగా ఇలియానా చివరిసారిగా శిర్షా గుహా ఠాకూర్త దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఔర్ దో ప్యార్ లో కనిపించింది. ఇందులో విద్యా బాలన్ , ప్రతీక్ గాంధీ, సెంధిల్ రామ్మూర్తి నటించారు.
Also Read : Beauty Sreeleela-Karthik :శ్రీలీల..కార్తిక్ ఆర్యన్ ఫస్ట్ లుక్ రిలీజ్