South Heroines : పిల్లల తల్లిగా చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఆమె బాలీవుడ్ ఎంట్రీ జవాన్‌లోనూ ధైర్యంగా ఓ పాపకు తల్లిగా నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ రాక్కాయిలోనూ తల్లిగా మెప్పించారు. తెలుగులో సమంత కూడా ఎప్పటి నుంచో ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్ సిటాడెల్‌లోనూ తల్లిగా సామ్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ సిరీస్ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. సీనియర్ హీరోయిన్లలో శ్రుతిహాసన్ కూడా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఎప్పుడో యాక్ట్ చేశారు. రవితేజ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ మూవీలో క్లాస్ కల్యాణిగా ఆమె మెప్పుపొందింది ఓ కొడుకుకు తల్లిగానే.
South Heroines….
త్రిషను లియోలో చూసిన వారు.. అదేంటి? అంత పెద్ద పిల్లలకు తల్లిగా చేయడానికి ఆమె ఎలా ఒప్పుకున్నారు? అని వండర్ అయ్యారు. విజయ్, త్రిష పెయిర్ తల్లిదండ్రులుగా సూపర్బ్ అంటూ ప్రశంసలు అందుకుంది. దీపావళికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చుకున్న మూవీ లక్కీ భాస్కర్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఓ అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించారు. కథలో దమ్ముంటే హీరోయిన్‌కి పిల్లలున్నా.. లేకున్నా.. ఆడియన్స్ దగ్గర మైనస్ మార్కులేం పడవు. పైపెచ్చు.. మంచి పెర్ఫార్మర్ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయికలు.
Also Read : Arigapudi Vijay Kumar : ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత అరగపూడి కన్నుమూత