Hero Saif – Kareena Comment : ప్ర‌తిఘ‌టించినందుకే సైఫ్ పై క‌త్తిపోట్లు

పోలీసుల‌కు క‌రీనా క‌పూర్ ఫిర్యాదు

Kareena : ముంబై – త‌న భ‌ర్త సైఫ్ అలీ ఖాన్ పై జ‌రిగిన దాడి గురించి స్పందించింది న‌టి క‌రీనా క‌పూర్ ఖాన్(Kareena). న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో స్విట్జ‌ర్లాండ్ లో పాల్గొని ముంబైకి వ‌చ్చామ‌ని, అల‌సి పోవ‌డంతో అంతా నిద్ర‌లోకి జారుకున్నామ‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి దండుగుడు ప్ర‌వేశించ‌డం, దాడికి పాల్ప‌డ‌డం జ‌రిగింద‌న్నారు. అత‌డిని ప‌ట్టుకునేందుకు త‌న భ‌ర్త ప్ర‌య‌త్నం చేశాడ‌ని, కానీ ఫ‌లితం లేక పోయింద‌న్నారు క‌రీనా క‌పూర్ ఖాన్.

Kareena Kapoor Comment

ఇదే స‌మ‌యంలో అడ్డు కోబోయిన ప‌నిమినిషి లీలాకు కూడా గాయ‌మైంద‌ని తెలిపారు. దీంతో పెనుగులాట‌లో , ప‌ట్టుకునేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. ఇంత‌లోనే క‌త్తితో ఆరుసార్లు సైఫ్ అలీ ఖాన్ శ‌రీరంపై పొడిచాడ‌ని , దీంతో తాము చూస్తూ ఉండి పోయామ‌న్నారు క‌రీనా క‌పూర్ ఖాన్.

తాను, పిల్ల‌లం నిస్సహాయులుగా మారి పోయామ‌ని, ఆ స‌మ‌యంలో ఏమీ చేయ‌లేక పోయామ‌న్నారు. ఇదే విష‌యాన్ని బాంద్రా పోలీసుల‌కు వెల్ల‌డించారు న‌టి . ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం త‌న త‌న‌యుడు హుటా హుటిన ర‌క్త‌స్రావంతో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ను లీలావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని, ఇక అక్క‌డ ఉండ‌టం క్షేమం కాద‌ని త‌న సోద‌రి ఇంటికి తీసుకు వెళ్లింద‌ని చెప్పింది.

Also Read : Hero Saif Comment : అండ‌ర్ వ‌ర‌ల్డ్ తో లింకు లేదు

CommentsKareena KapoorSaif Ali KhanViral
Comments (0)
Add Comment