Huma Qureshi : బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఈమధ్యనే ఆమె పెళ్లి కూడా చేసుకున్నారు. తాజాగా తను ఇటు సినిమాలతో పాటు అటు వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా హుమా(Huma Qureshi) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సామాజిక వేదిక ఇన్ స్టా గ్రామ్ లో తన అనుభవాలను పంచుకుంది. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తను చెప్పింది. ఈ సందర్బంగా అద్భుతమైన ఫోటోను కూడా పంచుకుంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Huma Qureshi Comment
ఈ ఫోటో చుట్టూ పచ్చదనం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎంత సంపాదించినా వేస్ట్ అని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని సూచించింది. తాను ఎప్పుడూ కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని తెలిపింది హుమా ఖురేషీ.
ఇదిలా ఉండగా తన కెరీర్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. గత నెలలో హుమా మహారాణి నాల్గవ సీజన్ లో పని చేయడం ప్రారంభించానని తెలిపింది. మహారాణిగా తిరిగి వస్తున్నానని స్పష్టం చేసింది. సీజన్ 4కి సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. నా నిర్మాత సాహిబా క్లిక్ చేసారు. ప్రేక్షకులందరి ప్రేమకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ లో హుమా టైటిల్ రోల్ పోషించింది. ఈ సిరీస్ సీజన్ 1 కి కరణ్ శర్మ దర్శకత్వం వహించారు, సీజన్ 2 కి రవీంద్ర గౌతమ్, సీజన్ 3 కి సౌరభ్ భావే దర్శకత్వం వహించారు. ఇందులో సోహుమ్ షా, అమిత్ సియాల్, కని కుస్రుతి, ఇనాముల్హక్ కూడా నటించారు. ఈ రాజకీయ సిరీస్ 1990లలో బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ తన గృహిణి భార్య రబ్రీ దేవిని తన వారసురాలిగా చేసిన సంఘటనల నుండి పాక్షికంగా ప్రేరణ పొందింది.
Also Read : Popular Actress Abhinaya :ప్రియుడితో నటి అభినయ నిశ్చితార్థం