Beauty Huma Qureshi : క‌థ‌లో ద‌మ్ముంటే సినిమాలు స‌క్సెస్

న‌టి హుమా ఖురేషీ షాకింగ్ కామెంట్స్

Huma Qureshi : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి హుమా ఖురేషీ(Huma Qureshi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమాల‌కు సంబంధించి ఉత్త‌రాది, ద‌క్షిణాది అనే భేదం అంటూ ఉండ‌ద‌న్నారు. ఇటీవ‌ల బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. కొన్ని సినిమాలు చేయ‌డం ఈజీ అని, మ‌రికొన్నింటిని చేయ‌డం క‌ష్ట‌మ‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో హుమా ఖురేషీ(Huma Qureshi) స్పందించింది. సినిమాల‌కు క‌థ ముఖ్యం. అది హిందీనా లేక త‌మిళమా, తెలుగా, క‌న్న‌డ‌నా , మ‌ల‌యాళ‌మా అన్న‌ది స‌మ‌స్య కాద‌న్నారు.

Huma Qureshi Key Comments

సినిమాలు స‌క్సెస్ కావ‌డానికి ప్రాంతాలు, భాష‌లు కార‌ణం కాద‌న్నారు. క‌థ బాగుంటే చాలు జ‌నం ఆద‌రిస్తున్నార‌ని చెప్పారు. ఈ మ‌ధ్య‌న పాన్ ఇండియా పేరుతో విడుద‌లైన సినిమాల‌న్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాయ‌ని అన్నారు. య‌శ్ న‌టించిన కేజీఎఫ్, అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 , ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి, షారుక్ ఖాన్ న‌టించిన జ‌వాన్ ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయ‌న్నారు హుమా ఖురేషీ.

ఉత్త‌ర‌, ద‌క్షిణాది సినిమా రంగాల గురించి ప్ర‌స్తుతం చ‌ర్చ అన‌వ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనం ఏ స్థానిక, నిర్దిష్ట భారతీయ కథలను తీసుకోవాలని అనుకుంటున్నామో దానిపై మన దృష్టి ఉండాలని స్ప‌ష్టం చేశారు.

హాలీవుడ్ లో నిర్మించిన సినిమాలు మ‌న దేశంలో కూడా స‌క్సెస్ అయ్యాయ‌ని, మ‌న మూవీస్ కూడా అమెరికా, పాకిస్తాన్ , లండ‌న్ , ఆస్ట్రేలియాలో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ బ‌డుతున్నాయ‌ని చెప్పారు హుమా ఖురేషీ.

Also Read : Sekhar Kammula Shocking :అందాల ‘గోదావ‌రి’ అల‌రించేందుకు రెడీ

CommentsHuma QureshiViral
Comments (0)
Add Comment