Huma Qureshi: డిటెక్టివ్‌ రూహిగా వస్తున్న హుమా ఖురేషీ !

డిటెక్టివ్‌ రూహిగా వస్తున్న హుమా ఖురేషీ !

Huma Qureshi: ‘గులాబీ’లో ఆటోవాలాగా కనిపించనున్న బాలీవుడ్‌ బ్యూటీ హుమా ఖురేషీ… ఇప్పుడు డిటెక్టివ్‌ రూహి పాత్ర పోషించనుంది. వికాస్‌ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బయాన్‌’లో ఆమె ఈ పాత్ర పోషించనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని శీలాదిత్య బోరా, మధు శర్మ, కునాల్‌ కుమార్, అన్షుమన్‌ సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని హుమా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. అంతేకాదు చిత్రబృందంతో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది.

Huma Qureshi Movie Updates

‘నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బయాన్‌’. చిత్ర కథనం అద్భుతంగా ఉంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇందులో భాగం కానున్నారు’ అంటూ రాసుకొచ్చింది. తన తండ్రి కోసం.. డిటెక్టివ్‌గా మారిన రూహి, తొలి కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్‌లోని ఓ పల్లెటూరికి వెళ్తుంది. అక్కడ ఎదుర్కొన్న సవాళ్ల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం రానుంది. సచిన్‌ ఖేడ్కర్, చంద్రచూఢ్‌సింగ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Also Read : Mahesh Babu: మహేశ్ బాబు‘ఒక్కడు’మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా ?

BayaanHuma Qureshi
Comments (0)
Add Comment