Hrithik Roshan : బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోశన్(Hrithik Roshan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ సూపర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు. తనతో కలిసి నటించడం ఆనందంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు. తనతో డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడ్డానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా రోషన్, తారక్ కలిసి వార్ -2 చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్రకటించారు.
Hrithik Roshan Praises Jr NTR
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో భారీ అంచనాలు పెరిగాయి. ఇద్దరూ సూపర్ హీరోలుగా ఇప్పటికే గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించారరు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తను ప్రశాంత్ నీల్ చిత్రంలో డ్రాగన్ లో నటిస్తున్నాడు. మరో వైపు కొరటాల తీసిన దేవర మూవీకి సంబంధించి సీక్వెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ ఇందులో కీ రోల్ పోషించనుంది.
ఇక వార్ -2 మూవీలో ఫిమేల్ రోల్ లో కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ నిర్మిస్తోంది. సినిమా షూటింగ్ శర వేగంగా పూర్తి చేసుకుంది. కేవలం ఒకే ఒక్క సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉంది. అది కూడా పూర్తయితే ఇక రిలీజ్ చేయడమే తరువాయి. పాట చిత్రీకరణ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ నటన సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు.
Also Read : Anchor- Hero Pradeep :అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్ రిలీజ్