Chay-Sobhita : నాగ చైతన్య, శోభితల ప్రేమ, పెళ్లి వరకు ఎలా వచ్చింది…

2022 ఏప్రిల్‌ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా...

Chay-Sobhita : అక్కినేని నాగచైతన్య, శోభితల వివాహం ఈ నెల 4న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే! పెళ్లి తర్వాత ఈ జంట ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వీరిద్దరూ వారి పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు.

Chay-Sobhita…

2022 ఏప్రిల్‌ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. ‘నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడు కలిసినా ఫుడ్‌ గురించే మా అభిప్రాయాలు పంచుకునేవాళ్లం. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య నన్ను తరచూ అడిగేవారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపచి?ంది. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటా. నేను పెట్టే గ్లామర్‌ ఫొటోలు కాకుండా .. స్ఫూర్తిమంతమైన కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లకు నాగచైతన్య(Naga Chaitanya) లైక్‌ చేసే వారు’. మొదటిసారి ముంబయిలోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిశా.

అప్పుడు చైతన్య హైదరాబాద్‌, నేను ముంబయిలో ఉండేవాళ్లం. నాకోసం హైదరాబాద్‌ నుంచి ముంబయి వచ్చేవారు. మొదటిసారి మేం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్‌ డ్రెస్‌, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లాం. అక్కడ కొంత సమయం గడిపాం. ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్లాం. అప్పటి నుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమే. న్యూ ఈయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం నాగచైతన్య కుటుంబం నన్ను ఆహ్వానించారు ఆ మరుసటి సంవత్సరం చైతన్య నా కుటుంబాన్ని కలిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు.

నాగచైతన్యమాట్లాడుతూ ” శోభితను తెలుగులో మాట్లాడమని ఎప్పుడూ అడిగేవాడిని. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులు కలుస్తుంటారు. వారిలో తెలుగులో మాట్లాడేవారిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వాళ్లతో త్వరగా కనెక్ట్‌ అవుతాను. శోభిత పరిచయం అయ్యాక నాతో తెలుగులో మాట్లాడాలని తరచూ అడిగేవాడిని’ అని నాగచైతన్య అన్నారు.

Also Read : Aamir Khan : తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ అగ్రహీరో ఆసక్తికర వ్యాఖ్యలు

marriageNaga ChaitanyaSobhita DhulipalaTrendingViral
Comments (0)
Add Comment