Devara: ‘దేవర’ షూటింగ్‌లో తేనెటీగల దాడి ! 20 మందికి గాయాలు ?

'దేవర' షూటింగ్‌లో తేనెటీగల దాడి ! 20 మందికి గాయాలు ?

Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్నారు. తీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ కథాంశంతో ఇది తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను అక్టోబరు 10న మొదటి పార్టును విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇటీవలే హైదరాబాద్, గోవాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌ లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Devara Movie Updates

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర(Devara) షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జూనియర్‌ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్‌ లేరు. ఆయన ప్రస్తుతం ‘వార్‌2’ సెట్స్‌లో ఉన్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న దేవరలో ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్‌ అలీఖా న్ , టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్‌ షెడ్యూల్‌ లో తొలుత ఎన్టీఆర్‌ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read : Brahmastra: అరుదైన రికార్డు సాధించిన రణ్ బీర్ ‘కేసరియా’ పాట !

Devarakoratala sivaNTR
Comments (0)
Add Comment