Vijay: విజయ్ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కోసం ‘అవతార్‌’ నిపుణులు !

విజయ్ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కోసం ‘అవతార్‌’ నిపుణులు !

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌ టైమ్‌’. ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష ఓ పాటతో పాటు కీలక పాత్రలో నటిస్తోంది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో ముస్తాబవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ తన రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా మారే అవకాశం ఉండటంతో… గోట్ సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

Vijay Movie Updates

ఈ నేపథ్యంలో ‘గోట్‌’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చిత్ర నిర్మాణ సంస్థ. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌కి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చనా కళ్పతి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉండటం… హీరో విజయ్‌(Vijay) కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపాల్సి రావడంతో… అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులకు ఈ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు అప్పగించినట్టు సమాచారం. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. యువన్‌ శంకర్‌రాజా బాణీలు సమకూర్చుతున్నారు.

Also Read : Krishnamma: సైలెంట్‌ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’ !

avatarThalapathy VijayThe Greatest of All Time
Comments (0)
Add Comment