Hollywood : మరో సెలబ్రెటీ కపుల్ జంటగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ డిజైరబుల్ కపుల్స్ లో ఒకటైన స్పైడర్ మాన్ ఫిల్మ్ మెయిన్ లీడ్స్ టామ్ హాలండ్(Tom Holland), జెండయా ఫైనల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు షోలో జెండయా పెద్ద డైమండ్ రింగ్‌తో కనిపించిన కొన్ని గంటల తర్వాత టామ్, జెండయా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే రిపోర్ట్ వచ్చింది.
Hollywood New Couple…
మెగాషో రెడ్ కార్పెట్ సమయంలో, లాస్ ఏంజిల్స్ టైమ్స్ రిపోర్టర్ ఆమెను రింగ్ గురించి అడిగినప్పుడు, ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. బదులుగా.. హాయిగా నవ్వుతు భుజాలను కుదిపింది. దీనితో అభిమానులలో మరింత ఆసక్తిని రేపింది. టామ్ హాలండ్, జెండయా 2021 నుండి కలిసి ఉన్నారు. వారు తరచుగా డేట్స్, ఈవెంట్‌లకు హాజరవుతూ కనిపించారు. వారి తక్కువ కీ పబ్లిక్ అప్పియరెన్స్ ఉన్నప్పటికీ, ఈ జంట తమ ప్రేమ గురించి ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. మరోవైపు స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ తర్వాత, జెండయా, టామ్ హాలండ్ తదుపరి మార్వెల్ చిత్రంలో మరోసారి కలిసి కనిపించనున్నారు. 2026లో విడుదల కానున్న క్రిస్టోఫర్ నోలన్ చిత్రం, ది ఒడిస్సీలో కూడా ఈ జంట స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామాలో అన్నే హాత్వే, మాట్ డామన్, లుపిటా న్యోంగో, రాబర్ట్ ప్యాటిన్సన్ చార్లీజ్ నటించనున్నారు.
Also Read : Allu Arjun : కిమ్స్ హాస్పిటల్ లో ‘శ్రీతేజ్’ ను పరామర్శించిన అల్లు అర్జున్