Ramayana: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్స్ లో ‘రామాయణ’ ఒకటి. అల్లు అరవింద్ నిర్మాతగా భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో తెరకెక్కించబోయే ‘రామాయణ’ సినిమాకు బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మూడు భాగాలుగా నిర్మాణం చేపట్టబోయే ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, రావణుడిగా యశ్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, హనుమంతుడిగా బాబీ డియోల్, సీత పాత్రలో సాయిపల్లవి లేదా జాన్వీ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు సంభాషణల బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
Ramayana Movie Updates
అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించకముందే… ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంతో ముఖ్యమైన సంగీతం కోసం చిత్ర బృందం ఆస్కార్ విజేతలను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ తో దీనికి ట్యూన్స్ చేయిస్తున్నారని తెలుస్తోంది. హన్స్ జిమ్మెర్ హాలీవుడ్ లోని టాప్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయనకు ఈ కథ గురించి వివరించగానే వెంటనే అంగీకరించారని… దీని పనులు మొదలుపెట్టేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇందులోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోవాలనే మూవీ యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని కూడా కొన్ని ఫొటోలు సందడి చేశాయి. దీనికోసం భారీ సెట్ వేశారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాకు తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు అప్పగించినట్లు సమాచారం. మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్ ను 2025 దీపావళికి తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ల కోసం నితేశ్ తివారీ(Nitesh Tiwari) టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించాలని మూవీ యూనిట్ యోచిస్తోందని అందుకే లుక్ టెస్ట్ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్ వినిపిస్తోంది. రణ్‌బీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రామాయణ’ కోసం తన అలవాట్లను మార్చుకున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు మాంసాహారం, మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Also Read : Rashmika Mandanna: రష్మిక బర్త్ డే గిఫ్ట్ గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ !