John Amos : హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జాన్ అమోస్ (84) కన్నుమూశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్దాప్య సమస్యలతో అగష్టు 21న చనిపోగా సుమారు 50 రోజుల తర్వాత అక్టోబర్ 1న బయటి ప్రపంచానికి తెలియడం అశ్యర్యానికి గురి చేస్తోంది. ఆయనకు రెండు సార్లు వివాహాం చేసుకోగా ఇద్దరితోనూ డైవర్స్ అయ్యాయి. మొదటి భార్యతో ఇద్దరు సంతానం ఉన్నారు. 1939 డిసెంబర్27న జన్మించిన అమోస్ 1971లో సినిమా కెరీర్ ప్రారంభించి 2023వరకు వివిధ సినిమాలు, టీవీ సిరీస్‌లలో క్యాకరెక్ట్ పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1977లో వచ్చిన రూట్స్, గుడ టైమ్స్ అనే సిరీస్‌లతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటివరకు సుమారు 50కి పైగా సినిమాల్లో నటించిన అమోస్ 100కు పైగా సీరియల్స్, సిరీస్‌లలో నటించాడు. చివరగా 2023లో వచ్చిన హాలీవుడ్ సినిమా ది లాస్ట్ పైఫిల్ మ్యాన్ సినిమాలో నటించిన అమోస్(John Amos) 2022లో ది రైటోస్ జెమ్ స్టోన్స్ అనే సిరీస్‌లో నటించాడు.
John Amos No More..
ఆయన అనేక సిరీస్‌లలో తండ్రి పాత్రలలో నటించడంతో అయనకు అమెరికా వ్యాప్తంగా టీవీ డాడ్ అనే ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం అమోస్ మరణ వార్త విన్న హాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయనతో వారికున్న అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Also Read : Pawan Kalyan : తిరుమలలో తన ఇద్దరు కుమార్తెలతో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్