Hina Khan: క్యాన్సర్‌ బారిన పడిన ప్రముఖ బాలీవుడ్‌ నటి !

క్యాన్సర్‌ బారిన పడిన ప్రముఖ బాలీవుడ్‌ నటి !

Hina Khan: ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటి హీనాఖాన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆమె స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇదే విషయాన్ని తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో ఆమె పోస్ట్‌ చేశారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్‌ మహమ్మారితో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని, దీని నుంచి కచ్చితంగా బయటపడగలననే నమ్మకం ఉందని ఆమె సోషల్‌మీడియా వేదికగా రాసుకొచ్చారు. అభిమానులు తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. కాగా హీనాఖాన్‌ పోస్ట్‌పై తోటి నటులు, అభిమానులు స్పందిస్తూ… మీపై ప్రేమాభిమానాలు, గౌరవం ఎప్పటికీ ఉంటాయని, త్వరగా కోలుకొని మా ముందుకురావాలని పోస్టులు పెట్టారు.

Hina Khan Health Issue

బాలీవుడ్‌ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటులలో హీనాఖాన్ ఒకరు. ప్రముఖ టీవీ సీరియల్ ‘ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’లో ఆమె పోషించిన అక్షర పాత్ర ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు పొందింది. అంతే కాకుండా హీనా బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారిలో బాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. మనిషా కోయిరాలా ఇటీవలే క్యాన్సర్ నుండి కోలుకున్నారు.

Also Read : Allu Sneha Reddy: జిమ్‌ వర్కవుట్స్ తో ఇరగదీస్తున్న అల్లు స్నేహారెడ్డి !

BollywoodBreast CancerHina Khan
Comments (0)
Add Comment