Jayapradha: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో రాంపూర్ ప్రజాప్రతినిధు కోర్టు తనకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను నిలిపివేయాలంటూ… జయప్రద దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు రాంపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును యధాతధంగా అమలుచేయాలని సూచించింది. దీనితో అలహాబాద్ హై కోర్టులో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లైయింది. ఈ నేపథ్యంలో గతంలో మార్చి 6వ తేదీలోపు జయప్రదను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని రాంపూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకానున్నాయి. అయితే దీనిపై జయప్రద(Jayapradha) గాని… ఆమె తరపు లాయర్లు గాని ఇంకా స్పందించలేదు.
Jayapradha Case Updates
సినీ నటి జయప్రద… 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రెండు కేసులు రాంపుర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా ఆమెకు అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీనితో ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనితో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి.. తదుపరి విచారణ వాయిదా వేసింది.
దీనితో రాంపూర్ కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను నిలిపివేయాలంటూ… జయప్రద(Jayapradha) అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించింది. దీనితో జయప్రద పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసన… అరెస్టు వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే త్వరలో మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు.
Also Read : Gaami: PCX ఫార్మాట్ లో విశ్వక్ సేన్ ‘గామి’ థియేట్రికల్ ట్రైలర్ !