Hide N Seek: హైడ్ న్ సిక్ పోస్టర్ విడుదల చేసిన హీరో శివాజీ !

హైడ్ న్ సిక్ పోస్టర్ విడుదల చేసిన హీరో శివాజీ !

Hide N Seek: విశ్వంత్, శిల్ప మంజునాథ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ ని సీనియర్‌ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్(Hide N Seek) చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు.

Hide N Seek Movie Updates

ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని… మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బసిరెడ్డి రానా మాట్లాడుతూ… ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్‌ చేస్తున్నాను అని అన్నారు.

Also Read : Avatar: Fire And Ash: ‘అవతార్‌-3’ కు సంబంధించి అదిరే అప్‌డేట్‌ ఇచ్చిన జేమ్స్ కామెరూన్‌ !

Hide N SeekSivaji
Comments (0)
Add Comment