నేచురల్ స్టార్ నాని, ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన హాయ్ నాన్న హృదయాలను ఆకట్టుకునేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది దసరాకు భారీ ఎత్తున సినిమాలు రానున్నాయి. పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. తెలుగు రాష్ట్రాలు పండుగను పురస్కరించుకుని సెలవులు ప్రకటించారు. దీంతో మూవీ మేకర్స్, నిర్మాతలు ఫెస్టివల్ ను ఆధారంగా చేసుకుని రిలీజ్ చేస్తున్నారు.
వాటిలో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ నటించిన భగవంత్ కేసరి రాబోతోంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇక మాస్ మహరాజా, నుపుర్ సనన్ తో తీసిన టైగర్ నాగేశ్వర్ రావుతో పాటు తళపతి విజయ్ నటించిన లియో కూడా రాబోతోంది.
ఇదే సమయంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన సలార్ చిత్రం రికార్డుల మోత మోగించేందుకు సిద్దమైంది. ఈ తరుణంలో వీటిని తట్టుకుని నిలబడేందుకు శౌర్యువ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న పోస్టర్స్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మలయాళ సినీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.