Hesham Abdul Wahab: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్న సంగీత దర్శకుడు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్న సంగీత దర్శకుడు

Hesham Abdul Wahab: దర్శన… అనే పాటతో తెలుగు సంగీత ప్రియులను పలకరించి… నా రోజా నువ్వే, సమయమా అంటూ యువతను ఉర్రూతలూగిస్తున్న సరికొత్త స్వరం…. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌. మలయాళ సినిమా ‘హృదయం’లో దర్శన… అనే పాట తరువాత తెలుగులో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఖుషి’ తో హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ పేరు మార్మోగిపోయింది. తాజాగా ‘హాయ్‌ నాన్న’ సినిమాకి కూడా అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్ వహాబ్ ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Hesham Abdul Wahab – ‘హాయ్‌ నాన్న’ బిజిఎం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించిన అబ్దుల్ వహాబ్

‘హాయ్‌ నాన్న’ సినిమా గురించి సంగీత దర్శకుడు అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) మాట్లాడుతూ ‘‘నా వరకూ దర్శకుడి విజన్‌ని అనుసరిస్తూ సంగీతం సమకూర్చడానికి ప్రయత్నిస్తుంటా. అంతకుముందు చేసిన సినిమాల్ని, వాటి పాటల్ని పక్కనపెడతా. వాటిని వినడానికి కూడా ఇష్టపడను. చేస్తున్న కథే నా ప్రపంచం అవుతుంది. అలా ఈ కథతో కొన్ని నెలలపాటు ప్రయాణం చేస్తూ పాటల్ని సమకూర్చాను అన్నారు.

ఒక హుక్‌ పదం తీసుకుని దానితోనే పాటని మొదలు పెట్టడం నాకు అలవాటు. దర్శన, సమయమా, గాజుబొమ్మ, ఓడియమ్మ… అనే హుక్‌ పదాలతో నేను పాటలు చేశాను అన్నారు. అంతేకాదు ‘హాయ్‌ నాన్న’ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తొలిసారి నేపథ్య సంగీతం కోసం తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ను ఉపయోగించినట్లు ఆయన స్పష్టం చేసారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఓ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం ఇదే తొలిసారేమో అని అన్నారు.

ఖుషి’, ‘హాయ్‌ నాన్న’ తరువాత వరుస ఆఫర్లు

‘ఖుషి’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్న అబ్దుల్ వహాబ్… ప్రస్తుతం శర్వానంద్‌ -శ్రీరామ్‌ ఆదిత్య కలయికలో తెరకెక్కిస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాకీ కూడా అబ్దుల్ వహాబ్ పనిచేస్తున్నారు.

Also Read : Hero Dhanush: మాఫియా లీడర్ గా ధనుష్‌ ?

Hesham Abdul Wahabhi nanna
Comments (0)
Add Comment