Megha Akash : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ తార మేఘ

రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు...

Megha Akash : నితిన్‌ నటించిన ‘లై’ సినిమాతో కథానాయికగా పరిచయమై సినీ ప్రియులను అలరించారు మేఘా ఆకాశ్‌. తాజాగా ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడడుగులు వేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శనివారం సాయంత్రం వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించగా తమిళనాడు ముఖ్యమంత్రి Stalin హాజరై నూతన జంటకు అభినందనలు తెలిపారు.

Megha Akash Marriage Updates

మేఘా ఆకాశ్‌ సోషల్‌ మీడియాలో రిసెప్షన్‌ ఫొటోలు షేర్‌ చేసి జీవితంలో తనకెంతో ఇష్టమైన అధ్యాయం ఇదేనని పేర్కొన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. ‘ ఛల్‌ మోహన్‌ రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘా’, ‘పేట’, ‘కుట్టి స్టోరీ’, ‘రాధే’ వంటి చిత్రాల్లో మేఘా ఆకాశ్‌ నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Also Read : SIIMA Award Winners : సైమా 2024 అవార్డు అవార్డు విజేతలు వీరే..

marriageMegha AkashTrendingUpdatesViral
Comments (0)
Add Comment