Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ మ్యారేజ్ ఫిక్స్…గోవాలో పెళ్లా..?

ఆ తర్వాత దుబాయికి చెందిన ఓ వ్యాపారితో పెళ్లి ఖాయమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది...

Keerthy Suresh : సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమలు, పెళ్లి సంబంధించిన వార్తలకే కొదవే ఉండదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అనేలా పరిస్థితితులు ఉంటాయి. పలానా హరోయిన్‌, పలానా వ్యక్తితో ప్రేమలో ఉందని. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు రావడం సర్వసాధారణం. అయితే ఆ తర్వాత ఆ వార్తలపై హీరోయిన్లు క్లారిటీ ఇవ్వడంతో వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంటాయి. ఇలా పెళ్లి వార్తలతో ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటున్నారు అందాల తార కీర్తి సురేష్‌(Keerthy Suresh). కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు చాలా సార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది కూడా. మొన్నటికిమొన్న ఆమె మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Keerthy Suresh…

ఆ తర్వాత దుబాయికి చెందిన ఓ వ్యాపారితో పెళ్లి ఖాయమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే వీటిపై కీర్తి సురేష్‌ ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. పైగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సున్నితంగా తిరస్కరించింది. కాగా తాజాగా మరోసారి కీర్తి సురేష్‌ పెళ్లికి సంబంధించి వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తన చిరకాల మిత్రుడితో కీర్తి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరుకుటుంబాల అంగీకాంతో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోందని, గోవా బీచ్లో పెళ్లి వేదికను ఫిక్స్‌ చేశారని బాలీవుడ్‌ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తాజాగా సౌత్‌ మీడియాలోనూ ఈ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కీర్తి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. దీంతో ఈ వార్తల్లో నిజంగానే నిజం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి కీర్తి పెళ్లికి సంబంధించి క్లారిటీ రావాలంటే బ్యూటీ స్పందించే వరకు చూడాల్సిందే.

Also Read : RGV Case : సీనియర్ డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ కు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Keerthy SureshTrendingUpdatesViral
Comments (0)
Add Comment