Aishwarya Lekshmi : అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరోయిన్ ఐశ్వర్య

ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? చేసింది తక్కువే సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది...

Aishwarya Lekshmi : సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మతో ఈ బ్యూటీ ఒకరు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్యూట్ లూస్, ఆకట్టుకునే స్మైల్ తో కనిపించే ఈ బ్యూటీ.. సడన్‌గా ఇలా చేతికి సెలైన్ బ్యాండేజ్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఆ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? చేసింది తక్కువే సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఫొటోలో హాస్పటల్ బెడ్ పై కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు. తమిళ్ గ్లామరస్ బ్యూటీ.. ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lekshmi). ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lekshmi). ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Aishwarya Lekshmi Health..

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అలాగే తమిళ్ లో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరియిన్ గా నటిస్తుంది ఈ అమ్మడి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది . తాజాగా ఈ అమ్మడు అనారోగ్యానికి గురైంది. అందుకు సంబందించిన ఫోటోలను పంచుకుంది.

Also Read : Devara : అతి ఉత్సాహంతో ఎన్టీఆర్ ‘దేవర’ కటౌట్ దగ్ధం అభిమానులు

Aishwarya LekshmiHealth ProblemsUpdatesViral
Comments (0)
Add Comment