Hero Yash: కిరాణా షాపులో ఐస్ క్యాండీ కొంటున్న కేజీఎఫ్ హీరో ! ఫోటోలు వైరల్ !

కిరాణా షాపులో ఐస్ క్యాండీ కొంటున్న కేజీఎఫ్ హీరో ! ఫోటోలు వైరల్ !

Hero Yash: సినిమా రంగంలో కాస్తా పేరు, గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చిదంటే చాలు… చిన్ని చిన్న ఆనందాలను పొందడానికి సెలబ్రెటీలకు తమ స్టాటస్ అడ్డొస్తుంది. అదే పాన్ ఇండియా స్టార్స్ కు అయితే బయట అడుగుపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పోలీసు సెక్యూరిటీ లేదా వ్యక్తిగత బౌన్సర్లతో వెళ్ళాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు చిన్న చిన్న కోరికలను కూడా వారు తీర్చుకోలేకపోతారు. తమ కుటుంబ సభ్యుల కోరికలను కూడా తీర్చలేరు.

Hero Yash Viral

అయితే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపుపొందిన కన్నడ నటుడు యశ్ మాత్రం… తన కుమార్తె, భార్య కోరిన చిన్న కోరికను తీర్చడానికి చిన్న పాన్ షాప్ కు వెళ్లి ఐస్ క్యాండీలు కొని తెచ్చాడు. యశ్ కుటుంబం ఆర్ధిక స్థోమతకు ఏ స్టార్ హోటల్ లో ఇంపోర్టెడ్ చాక్లెట్లు అడగడం… అవి యశ్(Yash) తెచ్చి ఇవ్వడం సర్వ సాధారణం. అయితే చిన్ననాటి సంగతలు గుర్తు తెచ్చుకోవడానికి ఐస్ క్యాండీ అడగటం… అది అడిగిందేతడవుగా యశ్… ఓ చిన్న కిరాణా దుకాణం కు వెళ్లి కొని తెచ్చి ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

ఇటీవల తన కుటుంబంతో కలిసి ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ లోని షిరాలీకి వెళ్ళిన కన్నడ స్టార్ యశ్‌(Yash)… అక్కడి చిత్రపుర మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన భార్య, కూతురు ఐస్‌ క్యాండీ అడగడంతో దగ్గర్లో ఉన్న చిన్న దుకాణానికి వెళ్లిన యశ్… ఐస్‌ క్యాండీతో పాటు, కొన్ని చాక్లెట్లు కూడా కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్‌ అవుతున్నాయి. ‘ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో తినగలిగే అవకాశం, ఖరీదైన బహుమతులు కొనగలిగే సామర్థ్యం, విలాసవంతమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉన్నా… యశ్‌ సింపుల్‌గా ఉన్నారు’ అంటూ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు భార్య, పిల్లలను సంతోష పెట్టడానికి వేలు, లక్షల ఖరీదైన బహుమతులే ఇవ్వనక్కర్లేదు. వాళ్లు కోరుకునే చిన్న చిన్న సంతోషాలను నెరవేర్చినా చాలు అంటూ అభిమానులు యశ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కేజీఎఫ్ హీరో యశ్‌ కు తన కూతురంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో… కుటుంబానికీ అంతే సమయం కేటాయిస్తారు. ఏ మాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో సరదాగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే ఒక్కోసారి ప్రెస్‌ మీట్‌ లకు కూడా తన కుమార్తెను తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బుల్లితెర నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన యశ్‌(Yash) కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ కన్నడలో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కేజీయఫ్‌’ సిరీస్ తో బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్లు వసూళ్లు సాధించి పాన్‌ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం యశ్‌… మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్‌’ సినిమాలో నటిస్తున్నారు.

Also Read : Sivakarthikeyan: మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివ‌ కార్తికేయ‌న్ !

kgfyash
Comments (0)
Add Comment