Hero Yash: యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కేజిఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యశ్. శాండిల్ వుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘కేజిఎఫ్’ సిరీస్ తరువాత… దర్శకుడు ప్రశాంత నీల్… ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తుండగా… హీరో యశ్(Hero Yash) మాత్రం… తన నెక్ట్స్ ప్రాజెక్టు ఇంతవరకు ప్రారంభించలేదు. అదే సమయంలో ఫ్యామిలీకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోగా గుర్తింపు పొందిన యశ్… ‘కేజిఎఫ్’ సిరీస్ తరువాత ఎక్కువ తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు.
Hero Yash Surprise
అయితే అతని తరువాత సినిమా కోసం ఆశక్తిగా ఎదురు చేస్తున్న అభిమానులకు డిసెంబరు 8న సర్ ఫ్రైజ్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తను నటించబోయే 19వ సినిమా టైటిల్ తో పాటు ఇతర వివరాలను వెల్లడిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కే.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజిఎఫ్’ సిరీస్ తరువాత వస్తున్న సినిమా కావడంతో… పాన్ ఇండియా అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.
Also Read : Nayanatara: విద్యార్ధులకు బిర్యానీ వడ్డించిన నయనతార