Hero Vishal-Madha Gaja Raja : లేటైనా ‘మ‌ధ గ‌జ రాజా’ సూప‌ర్ స‌క్సెస్

జ‌న‌వ‌రి 31న తెలుగులో కూడా రిలీజ్

Hero Vishal : ఈ మ‌ధ్య తెగ వైర‌ల్ గా మారిన కోలివుడ్ స్టార్ హీరో విశాల్(Hero Vishal) లీడ్ రోల్ లో న‌టించిన మ‌ధ గ‌జ రాజా మూవీ చాన్నాళ్ల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి మార్కులే ప‌డ్డాయి. వివిధ కార‌ణాలతో ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత విడుద‌లైంది. ఆశించిన దానికంటే భారీ రెస్పాన్స్ వ‌స్తోంది ఈ మూవీకి. ఈ చిత్రం 2012లోనే పూర్త‌యింది. కానీ రిలీజ్ కు ఇంత స‌మ‌యం తీసుకుంది.

Hero Vishal Madha Gaja Raja Movie Updates

ఎట్ట‌కేల‌కు గ‌త వారం త‌మిళంలో విడుద‌లైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకుంది. వ‌సూళ్లతో దూసుకు పోతోంది. అక్క‌డ విజ‌యం అందుకోవ‌డంతో తెలుగులో మ‌ధ గ‌జ రాజాను తెలుగులో విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ నిర్ణ‌యించారు. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 31న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు ప్రారంభించారు.

న‌టుడు విశాల్ కు తెలుగులో కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అంద‌మైన ముద్దుగుమ్మ‌లు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, అంజలి మ‌ధ గ‌జ రాజా చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రానికి సి. సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టి ఖుష్బుకు భ‌ర్త కావ‌డం విశేషం.
జెమిని సర్క్యూట్ నిర్మించింది. ఇందులో సంతానం, సోను సూద్ న‌టించారు. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటంటే విశాల్ స్వ‌యంగా మై డియ‌ర్ ల‌వేరు పాట‌ను పాడారు. ఇది కూడా హిట్ అయ్యింది. సినిమాకు ప్ల‌స్ అయ్యింది.

Also Read : Hero Ajith Feels : మా నాన్న బ‌తికుంటే బాగుండేది

CinemaHero VishalMadha Gaja RajaTrendingUpdates
Comments (0)
Add Comment