Hero Vishal: కెప్టెన్‌ విజయకాంత్ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం !

కెప్టెన్‌ విజయకాంత్ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం !

Hero Vishal: కెప్టెన్ విజయకాంత్ సమాధి వద్ద కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ విజయకాంత్ మరణించినప్పుడు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల హాజరకాలేకపోయిన విశాల్(Hero Vishal)… మరో హీరో ఆర్యతో కలిసి మంగళవారం ఉదయం కోయంబేడులోని కెప్టెన్ సమాధికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ… ‘‘కేవలం సినిమా ప్రపంచంలోనే కాకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కెప్టెన్‌ విజయకాంత్‌. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడిగా భావిస్తాం. కానీ, విజయకాంత్‌ జీవించివున్నపుడే దేవుడయ్యారు. ఆయన చనిపోయిన సమయంలో నేను నగరంలో లేను. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని అన్ని పనులు చేసి ఉండాల్సింది. కానీ, ఏమీ చేయలేకపోయా. చివరి చూపునకు నోచుకోలేకపోయా. అందుకే నన్ను క్షమించమని వేడుకుంటున్నా.

Hero Vishal Emotional

భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ మన మనస్సుల్లో మాత్రం ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారు. నడిగర్‌ సంఘం భవవానికి కెప్టెన్‌ పేరును పెట్టేందుకు ఏ ఒక్కరూ ఆక్షేపణ తెలపకపోవచ్చు. ఈ విషయంలో కచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉండవని భావిస్తున్నా. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది. అదే సమయంలో విజయకాంత్‌కు ‘భారతరత్న’ పురస్కారాన్ని ఇస్తారో లేదో తెలియదు… కానీ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు’’ అని పేర్కొన్నారు.

Also Read : Rajini Lal Salam: రజనీ ‘లాల్ సలామ్’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

Captain Vijayakanthvishal
Comments (0)
Add Comment