Hero Vishal : దమ్ముంటే నన్ను ఆపండి అంటూ సవాల్ విసిరినా విశాల్

మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా...

Hero Vishal : తమిళ నటుడు విశాల్‌ ముక్కుసూటి మనిషి. ఏదైనా స్ట్రెయిట్ గా మాట్లాడతారు. మార్క్‌ ఆంటోని సినిమా విడుదల సమయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించాడు. రెడ్‌ జెయింట్‌ గుత్తాధిపత్యాన్ని, థియేటర్ల మాఫియాను ఎండగట్టాడు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవ్వాలని మీరెందుకు డిసైడ్‌ చేస్తారు? మీకేం హక్కు ఉందంటూ రెడ్‌ జెయింట్‌ని, ప్రభుత్వాన్ని నిలదీశాడు విశాల్‌(Hero Vishal). ఇప్పుడు అలాంటి పోరాటమే తమిళ నిర్మాతల మండలిపై చేస్తున్నారు. తాజాగా విశాల్‌ మీద తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశాల్‌తో ఎవ్వరూ సినిమాలు తీయొద్దని తీర్మానించుకున్నట్టుగా సమాచారం. దీంతో విశాల్‌ మండిపడ్డారు. తాజాగా ఆయనొక ట్వీట్‌ చేశారు. టీఎఫ్‌పీసీకి కౌంటర్‌గా ఆయన ట్వీట్‌ చేసినట్లు భావిస్తోంది కోలీవుడ్‌. మిస్టర్‌ కథిరేసన్‌ అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు విశాల్‌.

Hero Vishal Comment

“మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా.. మిస్టర్‌ కథిరేసన్‌? ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం.. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఉపయోగించాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. డబుల్‌ టాక్సేషన్‌, థియేటర్‌ మెయింటైన్స్‌ ఛార్జీలు అంటూ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం వెతికే దిశగా ఆలోచించండి. నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. ఆపేందుకు ట్రై చేసుకోండి. నువ్వు, నీకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు దమ్ముంటే నన్ను ఆపుకోండి’’ అని విశాల్‌ సవాల్‌ విసిరాడు. విశాల్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఎంతవరకూ వెళ్తుందో చూడాలి. విశాల్‌ సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు. ఎన్నో విపత్కర సందర్భాల్లో ఆయన బాధితులను ఆదుకున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్నారు.

Also Read : Vikrant Massey : జాతీయ అవార్డును సాధించిన 12th ఫెయిల్ సినిమా..స్పందించిన హీరో

BreakingCommentsViralvishal
Comments (0)
Add Comment