Hero Vikram : డార్లింగ్ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన విక్రమ్

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు...

Hero Vikram : పాన్‌ ఇండియాను దాటి పాన్‌ వరల్డ్‌ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఇటీవల ‘కల్కి’తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ చియాన్‌ విక్రమ్‌(Hero Vikram) ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ తంగలాన్‌’ చిత్రం సెప్టెంబర్‌ 6న హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ప్రమోషన్స్‌ ముమ్మరం చేశారు. తాజా చిట్‌చాట్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌. ఆయన్ను తెలుగు హీరో అనడం సరికాదు’ అని విక్రమ్‌ అన్నారు. మాళవిక మాట్లాడుతూ.. ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన భాష పరంగా సినిమా సరిహద్దులను తొలగించారు. ఆయన నటించిన సినిమాలపై ప్రేక్షకులు చూపే అభిమానం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అని అన్నారు.

Hero Vikram Appreciates

ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్‌’. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా దీని షూటింగ్‌ అప్‌డేట్‌పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ‘ ప్రభాస్‌ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయింది’ అని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కెఎన్‌) రిప్లై ఇచ్చారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో సిద్థమవుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌తో నిధి అగర్వాల్‌, రిద్థి కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి తో ఓ సినిమా చేయనున్నారు.

Also Read : Dhanush 3rd Movie : ముచ్చటగా మూడవ సినిమాకి దర్శకత్వం వహించనున్న ‘ధనుష్’

Chiyaan VikramCommentsPrabhasTrendingViral
Comments (0)
Add Comment