Hero Vikram Movie : చియాన్ విక్రమ్ 63వ సినిమా కు హీరోయిన్ల మధ్య పోటీ

ఇందులో భాగంగా హీరోయిన్‌ ఎంపికపై దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టిసారించారు..

Vikram Movie : చియాన్‌ విక్రమ్‌ తన 63 చిత్రాన్ని మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేయనున్నారు. యోగిబాబుతో ‘మండేలా’, శివకార్తికేయన్‌తో ‘మావీరన్‌’ వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన అశ్విన్‌.. తన తదుపరి ప్రాజెక్టులో విక్రమ్‌(Chiyaan Vikram)ను డైరెక్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. శాంతి టాకీస్‌ బ్యానరుపై తెరకెక్కే ఈ చిత్రం కోసం నటీనటులతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా హీరోయిన్‌ ఎంపికపై దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్లు మధ్య పోటీ నెలకొందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Hero Vikram Movie Updates

అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ‘చియాన్‌ 63’లో తొలుత సాయిపల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, సాయిపల్లవి పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల క్యాల్షీట్లను సర్దుబాటు చేయలేకపోయారట. దీంతో ప్రియాంకా మోహన్‌ లేదా శ్రీనిధి శెట్టితో సంప్రదింపులు జరుపుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈ ఇద్దరిలో ‘కోబ్రా’ మూవీలో విక్రమ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటించారు. అయినప్పటికీ మరో అవకాశం దక్కించుకునేందుకు ఆమె ముమ్మరంగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ప్రియాంకా మోహన్‌ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ, మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమాలో ఫైనల్‌గా హీరోయిన్‌గా ఎవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. విక్రమ్ విషయానికి వస్తే.. రీసెంట్‌గా ఆయన ‘తంగలాన్’ సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రత్యేకంగా ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత చేయబోతున్న ఈ ‘విక్రమ్ 63’ సినిమాకు కూడా మంచి కథ కుదిరినట్లుగా తెలుస్తోంది.

Also Read : Bollywood Beauty Deepika : ముంబైలో 100 కోట్లతో లగ్జరీ ప్రాపర్టీని కొన్న దీపికా

Chiyaan VikramMoviesTrendingUpdates
Comments (0)
Add Comment