Hero Vijay : పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందించిన దళపతి

మరో ట్వీట్‌లో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు...

Hero Vijay : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని 100% విజయ శాతంతో కొత్త చరిత్ర సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఘనవిజయం సాధించారు. దేశం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పవన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్(Hero Vijay) పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయమై ఆయన తన వ్యక్తిగత ఖాతాలోనూ, టీవీకే పార్టీ సోషల్ మీడియా ఖాతాలలోనూ ఇలా ట్వీట్ చేశారు: ‘‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు సంతోషంగా ఉంది. ప్రజల పట్ల మీ అంకితభావం మరియు పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. మీకు శుభాకాంక్షలు’ అని విజయ్ ట్విట్టర్‌లో రాశారు.

Hero Vijay Post

మరో ట్వీట్‌లో చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రబాబుకు అభినందనలు’’ అని అన్నారు. మీ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది, మరి పవన్ లాగే విజయ్ కూడా తమిళనాడులో జెండా ఎగురవేస్తాడో లేదో చూడాలి.

Also Read : Rachna Banerjee : తొలి ప్రయత్నంలోనే రికార్డు స్థాయిలో గెలిచి చూపించిన రచన

Hero VijayTrendingUpdatesVijayViral
Comments (0)
Add Comment