Hero Vijay: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్). ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహా, లైలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ ఇటీవలే ప్రకటించడంతో… ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో ఓ పాటను… విజయ్ పాడినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి ఎట్టకేలకు చెక్ పెట్టారు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.
Hero Vijay As A Singer
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ లో… హీరో విజయ్(Hero Vijay) ఓ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న యువన్… తమ రాబోయే సినిమా కోసం విజయ్ గాత్రంతో ఓ పాట రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ పాటకు వెంకట్ ప్రభు తండ్రి గంగై అమరన్ సాహిత్యమందించినట్లు తెలుస్తోంది. విజయ్ పాటను రికార్డ్ చేసామని సంగీత దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో… ఆ పాట కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Kriti Kharbanda: పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి !