Vijay Sethupathi : హాస్య నటుడు కుటుంబానికి అండగా నిలిచిన హీరో విజయ్ సేతుపతి

అలా ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు...

Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొడుతున్నాడు మక్కల్ సెల్వన్. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఇటీవల నటించిన మహారాజా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఆయన కెరీర్ లో 50వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోనూ వ్యూస్ పరంగా రికార్డుల మోత మోగిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇబ్బందుల్లో ఉన్న తన తోటి నటీనటులు, అభిమానులు, వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తున్నాడు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi Helps…

అలా ఆయన తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు తెనాలి కుటుంబానికి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు తెనాలి. విజయ్ సేతపతి(Vijay Sethupathi) సినిమాల్లో కూడా మెరిశాడు. ఇప్పుడు తెనాలి కుమారుడు విన్నరసన్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చదువుతున్నాడు. అయితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరో నటుడు భావ లక్ష్మణన్.. విజయ్ సేతుపతికి సమాచారం అందించాడు. దీనికి వెంటనే స్పందించిన మక్కల్ సెల్వన్ వెంటనే కాలేజీ ఫీజు రూ.76 వేల రూపాయలు చెల్లించాడు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఫీజు చెల్లిస్తానని మాటిచ్చాడు. దీంతో తెనాలి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివెరిసింది.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) చేసిన సాయంపై నటుడు తెనాలి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.. ‘ నా కుటుంబానికి విజయ్‌ సేతుపతి చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు మక్కల్ సెల్వన్ చేసిన మంచి పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గాంధీ టాక్స్ అనే ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. దీంతో పాటు విడుదలై పార్ట్ 2 కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.

Also Read : Sushant Singh Rajput : హీరో ‘సుశాంత్ సింగ్ రాజపుత్’ కేసులో కీలక అంశాలు

HelpingUpdatesVijay SethupathiViral
Comments (0)
Add Comment