Hero Vijay: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన అభిమానులకు కొత్త ఏడాదిలో శుభ వార్త అందించారు. అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభుత్వ దర్వకత్వంలో ‘దళపతి 68’ (వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కిస్తున్న సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ టైటిల్‌తో పాటు సినిమా ఫస్ట్‌లుక్ ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్(Vijay) రెండు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు. అందులో ఒకటి వయసు పైబడ్డ పాత్ర కాగా… మరొకటి యంగ్ లుక్. ఇద్దరూ ఫైటర్ జెట్ కాస్ట్యూమ్‌లో నడిచొస్తూ కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో నెలపై పడి ఉన్న పారాచూట్… ‘‘వెలుగు చీకటిని కబళించగలదు కానీ, చీకటి వెలుగును ఆక్రమించలేదు’’ అంటూ పోస్టర్‌పై రాసి ఉన్న కొటేషన్ ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
Hero Vijay Movie Updates
ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా ? లేక ఒక వ్యక్తి జీవితంలోని వేర్వేరు దశలను చూపిస్తున్నారా ? అనేది తేలాల్సి ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా… స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గతంలో ‘బాస్’, ‘పజిల్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల పేర్లు బయటకు వచ్చినప్పటికీ… చిత్ర యూనిట్ మాత్రం తాజాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే టైటిల్ ను ఖరారు చేసింది.
Also Read : Rakul Preet Singh: పెళ్లిపీటలెక్కనున్న రకుల్ ?