Hero Vijay: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘లియో’. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన విజయ్(Vijay)… ప్రస్తుతం ‘దళపతి 68’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మల్టీస్టారర్‌ని వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్నారు.
Hero Vijay 68th Movie
ఫాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘బాస్’, ‘పజిల్’ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఇవేవీ కాదంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమాకి ‘గోట్’ (గ్రేటెస్ట్ వన్ అక్రాస్ టైమ్స్) పేరు ఖరారైనట్టు కోలీవుడ్ సమాచారం. అయితే ఈ పేరును చిత్ర యూననిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండటంతో… టైటిల్ ఇంగ్లిష్‌లో ఉంటుందని చిత్రబృందం గతంలోనే పేర్కొంది. దీనితో ‘గోట్’ (గ్రేటెస్ట్ వన్ అక్రాస్ టైమ్స్) పేరు ఖరారైనట్టే అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
Also Read : Hero Mohanlal: ఆశక్తికరంగా మోహన్‌లాల్ కొత్త అవతారం