Hero Vijay: లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుండి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా ‘లియో’. త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని… హీరో విజయ్(Vijay) కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న చిత్రాల లిస్ట్‌లో చేరింది. దీనితో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గత కొన్ని రోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనితో ‘లియో’ సీక్వెల్ పై తాజాగా స్పందించారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
Hero Vijay Movie Updates
‘లియో’ సీక్వెల్ పై వస్తున్న పుకార్లపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ…. ‘‘లియో2’ కచ్చితంగా ఉంటుంది. కానీ, కాస్తా సమయం పడుతుంది. ప్రస్తుతం నేను ‘తలైవా 171’, ‘ఖైదీ2’ పనుల్లో బిజీగా ఉన్నాను. ఇవి పూర్తయిన తర్వాత ‘లియో’ సీక్వెల్ మొదలుపెడతాను’’ అని చెప్పారు. అయితే ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్‌సీయూ)లో భాగమవుతుందా ? లేదా? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో రూపొందిన ‘లియో’లో త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మేనన్ ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ అందించిన పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ‘లియో’ కు సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించడంతో యాక్షన్ ప్రియులు సంబరపడుతున్నారు.
Also Read : Hero Vishal: న్యూయార్క్ వీధుల్లో గర్ల్ ఫ్రెండ్ తో విశాల్ ?