Hero Venkatesh : బాలయ్య ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్న వెంకటేష్

అలాగే గెస్ట్ లతో గేమ్స్ ఆడిస్తూ.. వాళ్ళతో డాన్స్ లు చేస్తూ మెప్పిస్తున్నారు...

Venkatesh : నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్ స్టాపబుల్ పేరుతో ఓ టాక్ షో చేస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 జరుగుతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక షోకు వచ్చిన గెస్ట్ లను బాలకృష్ణ తనదైన స్టైల్ లో ఆటపట్టిస్తూ.. అలరిస్తున్నారు. తమ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు బాలకృష్ణ.

అలాగే గెస్ట్ లతో గేమ్స్ ఆడిస్తూ.. వాళ్ళతో డాన్స్ లు చేస్తూ మెప్పిస్తున్నారు.తాజాగా బాలయ్య షోకు విక్టరీ వెంకటేష్(Venkatesh) హాజరయ్యారు. వెంకటేష్ తో కలిసి బాలకృష్ణ సందడి చేశారు. ప్రస్తుతం వెంకటేష్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ వెంకటేష్ ను చిలిపి ప్రశ్నలతో ఆటపట్టించారు. అలాగే బాలయ్య అడిగిన ప్రశ్నలకు వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విషయాలతో పాటు వెంకటేష్ పర్సనల్ విషయాల గురించి, ఫ్యామిలీ విషయాలు గురించి కూడా మాట్లాడుకున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కొన్ని ఎమోషనల్ సంభాషణలు కూడా జరిగాయి. బాలయ్య షోలో వెంకటేష్ తో పాటు ఆయన సోదరుడు సురేష్ బాబు కూడా హాజరయ్యారు.

Hero Venkatesh Comments

బాలయ్యషోలో తన తండ్రి దిగ్గజ నిర్మాత రామానాయుడు గురించి మాట్లాడుతూ వెంకటేష్(Venkatesh) ఎమోషనల్ అయ్యారు. బాలకృష్ణ రామానాయుడు గురించి అడగ్గా.. వెంకటేష్, సురేష్ బాబు రామానాయుడు చివరి రోజులు గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. నాన్న వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. అలాగే ఫ్యామిలీని, సినిమాని బ్యాలెన్స్ చేసారు. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక కథ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయలేకపోయాము. మేము చాలా బాధపడ్డాం ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది. చివరి రోజుల్లో కూడా ఆయన సినిమా కోసమే బతికారు అని ఎమోషనల్ అయ్యారు వెంకటేష్. సురేష్ బాబు మాట్లాడుతూ.. నాన్న మంచి చేసినా ఎంపీగా ఓడిపోయాను అని బాధపడ్డారు. వెంకీతో సినిమా చేయలేదని బాధపడ్డారు అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు సురేష్ బాబు.

Also Read:Pushpa 2 : ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘పుష్ప 2’

Balakrishna NandamuriCommentsDaggubati VenkateshUnstoppableViral
Comments (0)
Add Comment