Hero Venkatesh : వెంకటేష్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా షెడ్యూల్ పొల్లాచ్చిలో

ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా....

Hero Venkatesh : విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. పొల్లాచ్చి లోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌లు పోషించిన భార్య, భర్తల పాత్రలపై ఒక అందమైన పాట చిత్రీకరించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Hero Venkatesh Movie Updates

ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. భాస్కరభట్ల సాహిత్యాన్ని సమకూర్చారు. డ్యాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటి కానుందని, తెరపై చూసేప్పుడు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్(Hero Venkatesh) మాజీ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.., ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా నటిస్తోంది. మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా ఇందులో ఇంకో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ త్రికోణ క్రైమ్ డ్రామాలో వెంకీ మాజీ ప్రేయసిగా ఆమె కనిపించనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేకు సహకరించారు. వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కి థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Also Read : Buddy: ఓటీటీలోకి అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ! స్ట్రీమింగ్‌ ఎక్కడంటే ?

anil ravipudiDaggubati VenkateshTrendingUpdatesViral
Comments (0)
Add Comment