Hero Upendra: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, పీరియాడికల్ సినిమా అయితే చాలు… సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తో చిత్ర యూనిట్ ముందుకు వస్తోంది. మొదట ఒక పార్టుతో సినిమాను ప్రారంభించినప్పటికీ హిట్ అయిన తరువాత… దానికి కొనసాగింపుగా సీక్వెల్ తో లేదా దాని ముందు భాగం ప్రీక్వెల్ తో చిత్ర యూనిట్ వస్తుంది. రక్త చరిత్ర, బాహుబలి, కేజీఎఫ్, కాంతారా, సలార్, దేవర, పొలిమేర, డెవిల్ ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం… లేదా పార్టు 1 హిట్ అయితే పార్టు 2 తీయడం సర్వ సాధారణం. కాని డిజాస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ తీయడం మాత్రం చాలా అరుదు.
Hero Upendra Movie Updates
అయితే దీనికి పూర్తి విరుద్ధంగా తెరపైకి రాబోతోంది ‘కబ్జా-2’. కన్నడ స్టార్ ఉపేంద్ర(Hero Upendra) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’. భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన ‘కబ్జా’ సినిమా…. ఉపేంద్రతో పాటు శాండిల్ వుడ్ లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్ సినిమాను కాపీ కొడుతూ తీశారనే విమర్శలతో పాటు, భారీగా నష్టాలు కూడా మూటగట్టుకుంది. అయితే డిజాస్టర్ గా నిలిచిన ‘కబ్జా’ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించాడు దర్శక-నిర్మాత ఆర్ చంద్రు. అంతేకాదు ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
ఆర్సీ స్టూడియోస్ బ్యానర్ పై ఒకేసారి 5 పాన్ ఇండియా సినిమాలు ప్రకటించారు దర్శక నిర్మాత ఆర్ చంద్రు. ఈ కార్యక్రమానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు, హీరో ఉపేంద్ర హాజరయ్యాడు. సీఎం, ఉపేంద్ర చేతుల మీదుగా కబ్జా-2ను సగర్వంగా ప్రకటించారు. అయితే రూ.400 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్న 5 సినిమాల్లో కబ్జా-2కు కూడా చోటివ్వడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించిన దర్శక-నిర్మాత చంద్రు… కబ్జా తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొచ్చారు. ఆ సినిమా చుట్టూ చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయని… ఈసారి ఉపేంద్రను మరింత కొత్తగా, ఎగ్రెసివ్ గా చూస్తారని అన్నారు. దీనితో ‘కబ్జా-2’ సినిమాపై మరల అంచనాలు ప్రారంభమయ్యాయి.
Also Read : Nivetha Pethuraj: బ్యాడ్మింటన్ కప్ కొట్టి టాలెంట్ చూపించిన హీరోయిన్ నివేత పెతురాజ్ !