Hero Suriya: సుధ కొంగరతో మరోసారి జతకట్టనున్న సూర్య !

సుధ కొంగరతో మరోసారి జతకట్టనున్న సూర్య !

Hero Suriya: వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. సూర్య సన్నాఫ్ కృష్ణన్, గజని, సెవెన్త్ సెన్స్, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి సినిమాలతో కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం సూర్య చిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’ లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ కంగువ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, గ్లిమ్స్‌ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తరువాత సూర్య మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

Hero Suriya Movie Updates

సూర్య తన 43వ సినిమాను ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాను సూర్య(Suriya) తన 2డీ ఎంటర్‌టైన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నటి నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళం స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ కు ఇది సంగీత దర్శకుడుగా 100వ సినిమా కావడం విశేషం. కాగా ఈ సినిమా పాటల రికార్డింగ్‌ మొదలు పెట్టిన సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్… తొలిపాటను ఓ యువ గాయని చేత పాడించారు. ఇదే విషయాన్ని జీవీ ప్రకాష్‌కుమార్‌ తన ఎక్స్‌(ట్విటర్)లో పేర్కొన్నారు. అంతేకాదు సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ సినిమా పాటల రికార్డింగ్‌ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : Amala Paul: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ !

sudha kongaraSuriya
Comments (0)
Add Comment