Hero Suriya: కథలు, పాత్రలపరంగా ప్రయోగాలు చేయడంలో ముందుండే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గజని, ఆరు, 24, శివపుత్రుడు, ఘటికుడు, సెవెన్త్ సెన్స్, జై భీమ్, ఆకాశం నీ హద్దురా, సింగం సిరీస్, కంగువా వంటి విభిన్నమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేయడంలో సూర్య(Suriya) దిట్ట. ఇటీవల జై భీమ్, ఆకాశం నీ హద్దురా కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సూర్య… ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాగా సుమారు 38 భాషల్లో తెరకెక్కిస్తున్న ‘కంగువా’లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1967లో తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఆకాశం నీ హద్దురా!’ సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగర దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Hero Suriya As a Student Leader
1967లో తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. దీని కోసం సూర్య ప్రత్యేకంగా స్టూడెంట్ లుక్ కోసం కరసత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాను ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Vin Diesel: హాలీవుడ్ స్టార్ హీరోపై లైంగిక వేధింపుల కేసు !