Hero Suriya: కడపకు సూర్య ‘కంగువా’ ?

కడపకు సూర్య ‘కంగువా’ ?

Hero Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షూటింగ్ ను ఇటీవలే చెన్నైలో పూర్తి చేసింది. అదే షూటింగ్ లో ప్రమాదవశాత్తు రోప్‌ కెమెరా తెగి హీరో సూర్యకు గాయాలయ్యాయి. అయితే గాయాల నుండి కోలుకున్న సూర్యతో(Suriya) పాటు చిత్ర యూనిట్… తదుపరి షూటింగ్ కోసం కడపకు బయలుదేరుతున్నారట.

Hero Suriya – డిసెంబరు రెండో వారంలో కడపలో ‘కంగువా’ షూటింగ్

సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కంగువా’. కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణను కడపలో ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. ఈ నెల రెండో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని చిత్ర యూనిట్ వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కడపలో జరగనుందట. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్‌ పార్ట్‌ ఏప్రిల్‌లో విడుదల కానుంది.

2024 ఏప్రిల్ లో ‘కంగువా’ ?

కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కంగువా’ ను సుమారు 38 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో ఉంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం..

Also Read : Vishal: రక్తపాతం సృష్టిస్తోన్న విశాల్ కొత్త సినిమా

KanguvaSuriya
Comments (0)
Add Comment