Hero Suriya : అభిమానులకు భరోసా ఇచ్చిన హీరో సూర్య

ఈ సందర్భంగా అభిమానులతో సూర్య మాట్లాడుతూ....

Hero Suriya : తన అభిమానులకు హీరో సూర్య ఒక హామీ ఇచ్చారు. ఇకపై యేడాదికి రెండు చిత్రాల్లో నటిస్తానని మాట ఇచ్చారు. ఇటీవల హీరో సూర్య(Hero Suriya) – చిరుత్తై శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘కంగువా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. దీంతో హీరోతో పాటు అయన అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలావుంటే, సూర్య ఇపుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న ‘సూర్య-45’ షూటింగ్‌ విరామ సమయంలో తనను కలుసుకునేందుకు వచ్చిన అభిమానులను పిలిపించుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కోయంబత్తూరులో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది వరకు అభిమానులు పాల్గొన్నారు.

Hero Suriya Comments

ఈ సందర్భంగా అభిమానులతో సూర్య మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశాను. తప్పకుండా రెండు సినిమాలను విడుదల చేస్తాను. అభిమానులను డిజప్పాయింట్ చేయను అని హామీ ఇచ్చారు. ఇదిలావుంటే, వచ్చే యేడాది సూర్య నటించిన ‘సూర్య-44’, ‘సూర్య-45’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఈ రెండు చిత్రాలకు ఇంకా టైటిల్స్‌ ఖరారు చేయలేదు. కాగా, ‘సూర్య-44’ చిత్ర టైటిల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసే సమయంలోనే వెల్లడించాలని మేకర్స్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇంక ‘కంగువా’ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాపై అటు హీరో, ఇటు దర్శకుడు విడుదలకు ముందు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కానీ విడుదల తర్వాత విజువల్‌గా మార్కులు సంపాదించుకున్న ఈ సినిమా.. స్టోరీగా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ‘కంగువా’ సినిమాతో నిర్మాతకు భారీ నష్టం రావడంతో.. చిత్ర నిర్మాతకు వెంటనే మరో సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చి.. గొప్పమనసు చాటుకున్నారు హీరో సూర్య.

Also Read : Allu Arjun : అల్లు అర్జున్ విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన పోలీసులు

CommentsSuriyaTrendingUpdatesViral
Comments (0)
Add Comment