Hero Suriya : డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్ట్ ‘సూరరైపోట్రు’ నుంచి తప్పుకున్న సూర్య

సుధా కొంగర ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకోవడానికి కారణం...

Hero Suriya : దర్శకురాలు సుధా కొంగర – హీరో సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరరైపోట్రు’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత వీరిద్దరు ‘పురనానూరు’ అనే ప్రాజెక్టుకు కలిసి పనిచేయనున్నట్టు గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి హీరో సూర్య తప్పుకున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మొదట ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.

Hero Suriya….

సుధా కొంగర ప్రాజెక్ట్ నుంచి సూర్య తప్పుకోవడానికి కారణం.. హీరో సూర్య(Hero Suriya) ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుధా కొంగర ప్రాజెక్టుకు తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో సూర్య, అలాగే చిత్ర నిర్మాణం నుంచి 2డీ ఎంటర్‌టైన్మెంట్‌ తప్పుకున్నట్టు సమాచారం. అయితే ఇదే ప్రాజెక్ట్‌ను సూర్య స్థానంలో శివకార్తికేయన్‌ తో మరో నిర్మాణ సంస్థలో సుధా కొంగర దర్శకత్వం చేయనుందనేలా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ఈ కథను తెరకెక్కించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో చేసిన ‘కంగువ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కాకుండా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను సూర్య ఓకే చేసి ఉన్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా సూర్య ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆ సినిమాల గురించి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Also Read : Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ కి క్షమాపణలు చెప్పిన ఆ సీనియర్ నటుడు

CommentsMoviessudha kongaraSuriyaViral
Comments (0)
Add Comment