Hero Suriya : హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు అభిమానులు. అలాగే అన్నదానం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. అలా తాజాగా సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని అతని అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం (జులై 16) ఈ రక్తదాన శిబిరాన్ని సూర్య సందర్శించాడు. అంతేకాదు అభిమానులతో కలిసి అతను కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. సూర్య పుట్టిన రోజు (జులై 23) వరకు తమిళనాడు అంతటా ఈ రక్తదాన శిబిరాలు కొనసాగనున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్య అభిమానులు. ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. అలా గతేడాది కూడా సుమారు 2000 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య(Hero Suriya) ఆ సమయంలో వీడియో కాల్ ద్వారా అభిమానులతో ముచ్చటించి వారిని అభినందించాడు. అంతేకాదు 2024లో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవుతానని మాట ఇచ్చాడు.
Hero Suriya Donated
ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ రక్తదాన శిబిరానికి వెళ్లి.. తాను కూడా రక్తం ఇచ్చాడు. అనంతరం ఫ్యాన్స్ తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారందరూ సూర్యతో పాటు అతని అభిమానులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఆన్ స్క్రీన్ పై ఎంతో స్టైలిష్ గా కనిపించే సూర్య ఈ రక్తదాన శిబిరంలోనూ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు. క సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన కంగువ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీంతోపాటు వాడీ వసూల్ సినిమా కూడా షూటింగ్ జరుపుకొంటోంది.
Also Read : Sitara : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మహేష్ కూతురు