Hero Suriya : హీరో సూర్య తో సినిమా చేయనని షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ డైరెక్టర్

శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమా....

Hero Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. గజినీ సినిమా దగ్గర నుంచి సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గజినీ సినిమా దగ్గర నుంచి సూర్య(Hero Suriya) నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సినిమా సిరీస్ మనదగ్గర కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక సూర్య(Hero Suriya) రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌లో కనిపించారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య నటించి ఆకట్టుకున్నాడు.

Hero Suriya…

శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దేవి శ్రీ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు.

ఇదిలాఉంటే తాజాగా సూర్యతో ఓ దర్శకుడు సినిమా చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరు.? ఎందుకు సూర్యతో సినిమా చేయను అని చెప్పాడు. దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ.. సూర్యతో సినిమా చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే అతను మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద సినిమా (కంగువా) విడుదలై దారుణంగా పరాజయం పాలైంది. అభిమానులు ఈ చిత్రానికి దారుణమైన రివ్యూలు ఇచ్చారు. సినిమా ఫెయిర్‌గా ఉంటే జర్నలిస్టులు, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చితే సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. మీరు సూర్య కోసం సినిమా చేస్తున్నారా.? అనే ప్రశ్నకు మిష్కిన్ మాట్లాడుతూ.. నేను అతనికి కథ చెప్పను. నాకు పిక్చర్ ఇచ్చినా ఒప్పుకోను. ఆయనతో సినిమా చేయను అని మిష్కిన్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్‌గా మారాయి.

Also Read : Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ లో హాలీవుడ్ అగ్రనటుడు

CommentsSuriyaViral
Comments (0)
Add Comment