Gorre Puranam : మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టి వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వధనం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఓ కొత్త కాన్సెప్ట్ చిత్రం ‘గొర్రె పురాణం’ తో అలరింంచేందుకు రెడీ అయ్యాడు.
Gorre Puranam Movie Updates
తాజాగా సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఫోకల్ వెంచర్స్ పతాకంపై ప్రవీణ్ రెడ్డి నిర్మించిన వినూత్న కథా చిత్రం ‘గొర్రె పురాణం(Gorre Puranam)’. ఈ చిత్రం ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్,ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. ఇదిలాఉండగా ఆయన నటించిన మరో చిత్రం జనక అయితే గనక ఈ వారమే (సెప్టెంబర్ 13)నేప్రేక్షకుల ముందుకు వస్తుండడం విశేషం.
అంటే వారం గ్యాప్‌లో సుహాస్(Suhas) నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ గొర్రె పురాణం మూవీ విషయానిక వస్తే.. ఓ గ్రామంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టిన ఒక గొర్రె కథ. కథ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కథ కథనంతో సోషల్ మెసేజ్ ఉన్న వినూత్న కథ. సుహాస్ చాలా బాగా నటించాడు. పవన్ సి హెచ్ స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ‘ భలే భలే’ మరియు ఓ రారే రారే లిరికల్ పాటలు విడుదలై గొర్రె పురాణం చిత్రం మీద అంచనాలు పెంచాయి. ఈ చిత్రంలో గొర్రెకి దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
Also Read : Nivin Pauly : తాను ఏ తప్పు చేయలేదంటూ పోలీసులకు ఆధారాలు చూపిన నవీన్ పౌలీ