Hero Siddharth : అతిథి తో మరోసారి పెళ్లి పీటలెక్కిన హీరో సిద్ధార్థ్

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి...

Hero Siddharth : టాలీవుడ్ హీరో, హీరోయిన్లు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వీరు పెళ్లిపీటలెక్కారు. తెలంగాణలోని వనపర్తిలో ఉన్న 400 ఏళ్ల నాటి రంగనాయక స్వామీ దేవాలయంలో సిద్ధార్థ్, అదితీ రావుల వివాహం సింపుల్ గా జరిగింది. ఇప్పుడు మరోసారి పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్. రాజస్థాన్‌లోని బిషన్‌గఢ్‌లోని అలీలా ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు సిద్ధార్థ్, అదితీ రావు. అనంతరం తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Hero Siddharth Marriage Updates

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సిద్ధార్థ్, అదితీ రావు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ కలిసి ‘మహాసముద్రం’ సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.

Also Read : South Heroines : కధలో దమ్ముంటే ఏ పాత్రకైనా సిద్ధమంటున్న ఈ భామలు

Aditi Rao HydarimarriageSiddharthTrendingUpdatesViral
Comments (0)
Add Comment