Hero Shivaji : మరో సరికొత్త పాత్రతో బుల్లితెరపైకి రానున్న నటుడు శివాజీ

హీరో శివాజీ సరికొత్త పాత్రలో బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు....

Hero Shivaji : బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన హీరో శివాజీ.. 90s వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈటీవీ విన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వగా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ భారీగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సిరీస్‌లో ఉపాధ్యాయుడి పాత్రలో శివాజీ నటించారు. ఇందులో డైలాగ్స్, స్టోరీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో మరోసారి శివాజీ టైమ్‌లైన్‌లోకి వచ్చారు. ఇక త్వరలో ఓ షోకు జడ్జిగా రానున్నారు.

Hero Shivaji..

హీరో శివాజీ సరికొత్త పాత్రలో బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈటీవీలో ఓ కామెడీ షోకు జడ్జిగా రానున్నారు. అయితే ఆయన ఏ షోకు న్యాయనిర్ణేతగా రాబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో శివాజీ తన ఆటతీరు ఆకట్టుకున్నారు. విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు వెన్నంటే ఉన్నారు. గేమ్ చివరి వరకు అన్నదమ్ములా కలిసి ఉన్నారు. శివాజీ మూడోస్థానంలో నిలిచినా.. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో చాలా సంతోషడ్డారు. బిగ్‌బాస్ షో తరువాత 90s వెబ్ సిరీస్‌తో మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై ఏ షో ద్వారా శివాజీ అలరిస్తారో చూడాలి మరి.

Also Read : Hero Vijay Sethupathi : తమిళ ‘బిగ్ బాస్’ హోస్ట్ గా హీరో విజయ్ సేతుపతి

SivajiTrendingUpdatesViral
Comments (0)
Add Comment