Hero Shah Rukh-Jonh Abraham :జాన్ అబ్ర‌హం షారుక్ ఖాన్ కిస్ వైర‌ల్

ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాన‌నంతే

Shah Rukh : బాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారారు టాప్ హీరోస్ జాన్ అబ్ర‌హం, షారుక్ ఖాన్(Shah Rukh). ఆ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారిద్ద‌రి మ‌ధ్య బ‌ల‌మైన బంధం కూడా ఉంది. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి ఇద్ద‌రూ వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రి గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా జాన్ అబ్ర‌హం షారుక్ ఖాన్ కు ముద్దు పెట్ట‌డం , ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో దీనిపై సీరియ‌స్ గా స్పందించాడు జాన్ అబ్ర‌హం.

Shah Rukh Khan-John Abraham Kiss Viral

షారుఖ్ ఖాన్ తో వైరల్ అయిన రొమాంటిక్ మీమ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇవాళ ఏం చేసినా అది చ‌ర్చ‌కు దారితీస్తోంది. సోష‌ల్ మీడియా ప‌రిధులు, ప‌రిమితులు దాటేస్తోందంటూ పేర్కొన్నాడు. షారుఖ్ ఖాన్ నుండి తన జీవితంలో అత్యుత్తమ ముద్దును అందుకున్నట్లు వెల్లడించాడు. 2023 హిట్ చిత్రం పఠాన్ లో ఇద్దరూ స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు.

సినిమా విజయోత్సవ పార్టీలో, షారుఖ్ ఖాన్ తన సహనటుడి బుగ్గలపై ముద్దు పెట్టుకుని, ఒక మధురమైన క్షణాన్ని సృష్టించాడు. ఈ ఇద్ద‌రూ ల‌వ‌ర్స్ అన్న‌ట్టు ప్రచారం జ‌ర‌గ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు ఇద్ద‌రు అగ్ర న‌టులు. నా వ‌ద్ద ఇప్పుడు మొబైల్ లేదు. దీని గురించి ప్ర‌త్యేకంగా విన్నాను. షారుక్ ఖాన్ తో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉందన్నాడు జాన్ అబ్ర‌హం. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేసే అవ‌కాశం రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు.

Also Read : Hero Nithin-Robinhood :రాబిన్ హుడ్ కు మిశ్ర‌మ స్పంద‌న

John AbrahamShah Rukh KhanUpdatesViral
Comments (0)
Add Comment