Hero Shah Rukh : తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించిన షారుఖ్

ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు..

Hero Shah Rukh : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఫ్రాన్స్‌లో కూడా షారుఖ్ ను ఇష్టపడే వారు ఉన్నారు. దీనికి తాజా ఉదాహరణే కింగ్ ఖాన్ కు దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో కొత్త బంగారు నాణెం విడుదలైంది. దానిపై షారుక్ ఖాన్ చిత్రం , పేరు ఉండడం విశేషం .

Hero Shah Rukh…

ఈ బంగారు నాణెం ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంతే కాకుండా ఇప్పుడు షారుఖ్ ఖాన్ గౌరవార్థం బంగారు నాణెం కూడా విడుదల చేశారు. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడు షారుక్ ఖాన్. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు కూడా షారూఖ్ ఖాన్ కావడం విశేషం.

Also Read : Multi Starer : నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ తో మల్టీ స్టారర్ చేయనున్న నాంది డైరెక్టర్

Shah Rukh KhanTrendingUpdatesViral
Comments (0)
Add Comment