Hero Raviteja: ‘ఈగల్’ సినిమా నుండి ‘గల్లంతే’ లిరికల్ సాంగ్ రిలీజ్

‘ఈగల్’ సినిమా నుండి ‘గల్లంతే’ లిరికల్ సాంగ్ రిలీజ్

Hero Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. దీనితో సినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి ‘గల్లంతే’ అనే సెకండ్ సింగిల్ విడుదల చేశారు.

Hero Raviteja Eagle Movie Updates

ప్రస్తుతం ఈ ‘గల్లంతే’ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ‘ఈగల్’లో రవితేజ(Raviteja) మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనుండగా… అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల కీలక పాత్రలలో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read : Mass Maharaj Raviteja: ‘హను-మాన్’కి రవితేజ సపోర్ట్

eagleraviteja
Comments (0)
Add Comment